ఒకవైపు కరోనా, మరోవైపు వర్షాలు
విరుచుకుపడుతున్నా మన సంసృతి సంప్రదాయాలను పక్కకు పెట్టకూడదు అనే ఉద్దేశ్యంతో కాసిపేట మండలంలో పలు గ్రామాలలో పొలాల అమావాస్య పండుగను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఇండ్లలో పిండి వంటకాలను చేసి పెద్దలకు నైవేద్యం సమర్పించారు. రేగులగూడెం గ్రామస్థులు గ్రామ పొలిమేర లోని గ్రామ దేవతకు పూజలు చేసి వర్షాకాలంలో సంభవించే వ్యాదులనుండి రక్షణ కల్పించాలని ప్రార్థించారు. అనంతరం గ్రామస్తులందరూ తమ గ్రామ దేవతకు నైవేద్యం సమర్పించారు.
![]() |
గ్రామ దేవతను దర్శించుకోవడానికి వెళ్తున్న గ్రామస్తులు |