Kasipet Mandal App:-
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి గారి
ఆదేశాల మేరకు ఈరోజు కాసిపేట మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో గందగి ముక్త్ భరత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. గ్రామాలలోని విధులలో ర్యాలీ చేసి ప్రజలకు అవగాహనా కల్పించారు. కోమటిచెను గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి గారు మరియు ఎంపీడీఓ ఎంఏ అలీం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, వర్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.