Kasipet Mandal App:-
కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల
సమీపంలో పార్క్ (పకృతి వనం) ఏర్పాటు కోసం 30 గుంటల స్థలాన్ని కేటాయించారు. పార్క్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు కాసిపేట సర్పంచ్ దరావత్ దేవి కొండయ్య కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఏ అలీం, తహసీల్దార్ భూమేశ్వర్, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శి మౌనిక తదితరులు పాల్గొన్నారు.