Kasipet Mandal App:-
కాసిపేట మండలం చింతగూడ గ్రామ శివారులోని
సర్వే నెంబర్ 61 హరితవనం కోసం భూమిని చదును చేస్తుండగా రాంపూర్ గిరిజన రైతులు, ఆదివాసీ నాయకులు పనులను అడ్డుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పిసా చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదం లేకుండా గిరిజనుల సాగు భూముల్లో ఇలాంటి నిర్మాణ పనులు చేపట్టడం చట్ట వ్యతిరేకమని అన్నారు. వెంటనే పనులను నిలిపివేయాలని ఆందోళన చేశారు. దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు తహసీల్దార్ గారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.