Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో తెలంగాణ ప్రభుత్వం
నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మండలంలోని ధర్మారావుపేట, ముత్యంపల్లి గ్రామాలలో గత నెలలో రైతు వేదికల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి గారు మండలంలో పర్యటించి, పనులను పర్యవేక్షించారు. రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, DE క్రిష్ బాబు, ఎంపీడీఓ ఎంఏ అలీం, ఏవో వందన, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, AE కళ్యాణ్ రెడ్డి, AEO శ్రీధర్, తిరుపతి, ధర్మారావుపేట ఎంపీటీసీ పర్వతి మల్లేష్, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ తిరుపతి మరియు ముత్యంపల్లి, ధర్మారావుపేట గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.