Kasipet Mandal App:-
మంచిర్యాల జిల్లాలో మూడు రోజులుగా
నిరంతరాయంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజులపాటు ఇదేవిధంగా వర్షాలు ఉండనున్నాయని వాతావరణ శాఖ వారు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలలో మరియు చెరువులకు సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి గారు సూచించారు. ఏవిధమైన సహాయం కోసమైన జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నెంబర్ 08736-250501 కి కాల్ చేయాలనీ తెలిపారు.