పత్తి పంటలో రసం పీల్చే పురుగు కనిపిస్తే
వేప నూనె 5% పిచికారి చేయడం ద్వారా దానిని అరికట్టవచ్చని కాసిపేట మండల వ్యవసాయ అధికారి వందన గారు రైతులకు సూచించారు. బీడు భూమిలో గాని, లేదా ఇతర పంటలు వేసి మొలకలు సరిగ్గా రాని చోట కంది పంటను వేయాలని ఆమె కోరారు. కొత్త పట్టాదారులు పాస్ పుస్తకంలో తప్పులు ప్రింట్ అయినవారు రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
![]() |
బుధవారం కోమటిచేనులో పంటను పరిశీలించిన MAO గారు |