App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

కాసిపేట - ముత్యంపల్లి గ్రామాల ప్రజలకు గమనిక

Digital Kasipet:-
కాసిపేట మండలంలో కరోనా కేసులు రోజురోజుకు
పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కాసిపేట పీ.హెచ్.సి లో 287 పరీక్షలు నిర్వహించగా 97 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మండలంలోని కేంద్రప్రాంతాలైన కాసిపేట, ముత్యంపల్లి గ్రామాలలో కిరాణా దుకాణాలు మధ్యాహ్నం 2 గంటలవరకు మాత్రమే తెరచి ఉంచాలని  దుకాణదారులు స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రేపటి నుండి ప్రతి గురువారం దుకాణాలను పూర్తిగా మూసివేయనున్నట్లు కూడా నిర్ణయించుకున్నారు. తదుపరి నిర్ణయం తీసుకునేవరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని  తెలిపారు. మండలంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App