Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

భయాందోళనలో కార్మికులు... లాక్ డౌన్ ప్రకటించాలని నిరసన

Kasipet Mandal App:-
మండలంలోని కాసిపేట-1 గని కార్మికులలో కరోనా
కేసులు నమోదవుతుండటంతో కార్మికులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. యాజమాన్యం కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవడంలేదని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికే గనిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 6 గురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. కార్మికుల క్షేమం కోసం లాక్ డౌన్ ప్రకటించాలని టిబిజికెఎస్ నాయకులు మరియు కార్మికులు సోమవారం నిరసన తెలిపారు. యాజమాన్యం స్పందించి లాక్ డౌన్ సాధ్యం కాదని, పాజిటివ్ వచ్చిన కార్మికుల ప్రైమరీ కాంటాక్ట్ లను గుర్తించి వారిని క్వారంటైన్ చేస్తామని, వారిలో లక్షణాలు ఉన్న వారికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App