Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో నాలుగు రోజులుగా
నిరంతరాయంగా వర్షం పడుతుండటంతో మల్కపల్లి గ్రామ శివారులోని నరసింగరావు చెరువులో నీటి మట్టం పెరిగి చెరువు కట్ట కొంత మేర దెబ్బతిన్నది. పరిస్థితి గమనించిన గ్రామ సర్పంచ్ జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. సర్పంచ్ మరియు స్థానిక యువకులు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టారు. సర్పంచ్ పేంద్రం కవిత హనుమత్ మాట్లాడుతూ ప్రమాదం ఏమి లేదని పేర్కొన్నారు.