కాసిపేట మండలంలో అధిక వర్షాలు కురుస్తున్న
నేపథ్యంలో రైతులకు మండల వ్యవసాయ అధికారి వందన గారు తగు సూచనలు చేశారు. వరి పంట త్వరగా కోలుకోవడానికి ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 10 కిలోల పొటాష్ ఎరువులను వేయాలని సూచించారు. వరిలో తెగుళ్లు వచ్చినట్లయితే ఒక గ్రాము carbendazim లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత పత్తి పంటకు coc (కాపర్ ఆక్సి క్లోరైడ్) మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క వేరు భాగం తడిచే విధంగా పిచికారి చేయాలన్నారు. పత్తి పంటలో పచ్చ దోమ కనిపిస్తే 5% వేప నూనె పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. అలాగే గులాబీ పురుగు విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, వరి పంటలో కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆమె పేర్కొన్నారు.
![]() |
కొండాపూర్ గ్రామంలో వరి పంటను పరిశీలిస్తున్న MAO వందన గారు |