Kasipet Mandal App:-
కాసిపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన
అజయ్ మరియు సాయి అనే ఇద్దరు చిన్నారులు మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో నాన్నను, రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో అమ్మను కోల్పోయి ఆనాధలు అయ్యారు. అదే గ్రామానికి చెందిన ఎంబడి కిషన్ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, సానిటైజర్, బ్యాగులు, సేంద్రియ బియ్యం, వాటర్ బాటిల్, మాస్క్ మరియు ఇతర నిత్యావసరాలను అందజేశారు. చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న సమాజ సేవకులు కొండ బాబుజి గారు వీరికి రూ.1,216 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.