Kasipet Mandal App:-
నిన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి
గారు కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప గ్రామంలో పర్యటించి పరిసరాల అపరిశుభ్రత కారణంగా కొందరికి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కొండాపూర్ గ్రామ పంచాయతీ వారు కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు ఈరోజు జరిమానా రసీదులను సంబంధిత వ్యక్తులకు అందజేశారు. దుకాణాలు మరియు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వ్యాపారులకు, ప్రజలకు సూచించారు.