Kasipet Mandal App:-
గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో
ఇండ్లలోకి వర్షపు నీరు వస్తుందని కాసిపేట మండలంలోని బుగ్గగుడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కాలువలు లేనందున ఈ దుస్థితి ఏర్పడిందని, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. తాత్కాలికంగా వర్షపు నీరు ఇండ్లలోకి రాకుండా గ్రామస్తులు అందరూ కలిసి కాలువను తవ్వారు. ఇకనైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామస్తులు అధికారులను మరియు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.