కాసిపేట మండలంలో నాలుగు రోజులుగా వర్షం
పడుతుండడంతో మండలంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, చెరువులు నిండు కుండలిని తలపిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులలో నీటి మట్టం పెరుగుతూ ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కోమటిచెనులోని సల్ఫాలవాగు ప్రాజెక్టు, మల్కపల్లి - రొట్టెపల్లి శివారులోని రాళ్లవాగు ప్రాజెక్టు, నర్సింగరావు సాగర్ చెరువు, గట్రావుపల్లి చెరువు, దేవాపూర్ లోని చిన్నవాగు మరియు ఇతర ప్రాంతాలను నీటిపారుదల శాఖ మరియు రెవిన్యూ శాఖ అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా DE నారాయణ్, బెల్లంపల్లి రెవిన్యూ డివిజన్ అధికారి శ్యామల దేవి, AE మాణిక్ రావు, ఎంపీడీఓ ఎంఏ అలీం, MRO భూమేశ్వర్, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.