కాసిపేట మండలంలో కరోనా వైరస్ నేపథ్యంలో
74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాకం ఎగరవేసి జండా వందనం చేశారు. ఈసారి పాఠశాలలలో ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా కేవలం పాఠశాల సిబ్బంది మాత్రమే పాల్గొని హడావిడి లేకుండా నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి గారు, MRO కార్యాలయంలో తహసీల్దార్ భూమేశ్వర్ గారు మరియు గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచులు జండాను ఆవిష్కరించారు. కాసిపేట మండల బీజేపీ అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి గారు దేవాపూర్ లో పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జాతీయ పథకాన్ని ఎగరవేశారు. మండలంలోని తెరాస పార్టీ నాయకులు వారి వారి గ్రామాలలో స్వతంత్ర వేడుకలను జరుపుకున్నారు.