కాసిపేట మండలంలో వర్ష బీభత్సానికి
మరో ఇల్లు కూలింది. మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో జాడీ సంజయ్ ఇల్లు నిన్న రాత్రి కూలిపోయింది. గత ఐదు రోజులుగా తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. మండలంలోని రెవిన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లి ఇంటిని పరిశీలించారు. మరోవైపు వర్షానికి రేగులగూడ వాగు నీటి ప్రవాహం పెరగడంతో గురువాపూర్ గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రవాహాన్ని దాటే సందర్భంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు గురువాపూర్ గ్రామస్థులకు తెలియజేసి మార్గాన్ని మూసివేశారు. కాసిపేట మండల ఎంఆర్వో భూమేశ్వర్, విఆర్వో లక్ష్మణ్, వైస్ ఎంపీపీ విక్రమ్, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, రాజేశం తదితరులు ఉన్నారు.