Kasipet Mandal App:-
కాసిపేట మండలం కొండాపూర్ యాప గ్రామంలో
సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు గౌడ కులస్తుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్తుల ఉపాధి కోసం ప్రవేశపెట్టిన నీరా పాలసీ, హరితహారంలో భాగంగా తాటి ఈత ఖర్జూర మొక్కల పెంపకం గురించి మాట్లాడుకున్నారు. ఈనెల 18న కొండాపూర్ చౌరస్తాలో సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం నిర్వహించి, మండల కమిటీని ఎన్నుకోవాలని తీర్మానించారు. ఈ సమావేశంలో మండల సహకార సంఘం ఉపాధ్యక్షులు తాటిపాముల శంకర్ గౌడ్, సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, దేవాపూర్ గౌడ సంఘం నాయకులు రాజయ్య గౌడ్, బైరి భాస్కర్ గౌడ్, నేరెళ్ల బుగ్గయ్య గౌడ్, పడాల మల్లేష్ గౌడ్, పోడేటి రాజా గౌడ్, ప్రకాష్ గౌడ్, విద్యాసాగర్ మరియు ధర్మారావుపేట మల్కపల్లి, కోనూరు, పల్లం గూడెం, కొండాపూర్ గ్రామాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.