Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని ఉమ్మడి కోనూరు
పంచాయతీ పరిధిలోని కొండాపూర్, తాటిగూడా, కోనూరు గ్రామాల గౌడ కులస్తుల సమావేశం ఈరోజు కొండాపూర్ గ్రామంలో జరిగింది. ఈ సమావేశంలో గౌడ కులస్తుల వివిధ సమస్యలపై చర్చించి గ్రామ మోకు దెబ్బ కమిటీని ఎన్నికున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పొడేటి రాజా గౌడ్, ఉపాధ్యక్షులుగా నేరెళ్ల నరసింగం, ప్రధాన కార్యదర్శి గా కొయ్యడ అంజనేయులు గౌడ్, సహాయ కార్యదర్శిగా ఇల్లందుల అశోక్ గౌడ్ మరియు కోశాధికారిగా గడ్డం ఎల్లా గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ ఎన్నిక ముఖ్యఅతిథిగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య హాజరయ్యారు.