Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని దేవపూర్ ఓరియంట్
సిమెంట్ కంపెనీకి చెందిన ప్రైవేట్ ఆస్పత్రిని గత నాలుగు రోజుల నుండి మూసివేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరూ సిబ్బందికి జ్వరం రావడంతో ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వారికీ ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, జ్వరం ఉన్నందున ముందస్తుగా మూసి వేశామన్నారు. సిబ్బంది త్వరగా కోలుకొని మళ్లీ సేవలు ప్రారంభించాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.