Kasipet Mandal App:-
కరోనా వైరస్ చాప కింద నీరులా కాసిపేట
మండలంలో విస్తరిస్తుంది. ముత్యంపల్లి గ్రామంలో నిన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి పాజిటివ్ గా తేలడంతో యావత్ కాసిపేట సమాజం ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు కాసిపేట మండలంలో మొత్తం ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయో అధికార సమాచారం లేనప్పటికి పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మండలంలోని ప్రజలు అప్రమత్తం అయి తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాకు కళ్లెం వెయ్యొచ్చు. సామూహిక వ్యాప్తి లేకుండా ఆపొచ్చు. మరోవైపు కాసిపేట 1 గనిలో నిన్న ఒక పాజిటివ్ రావడంతో గనిలో మొత్తం కేసుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే చాలా మంది కార్మికులు హోమ్ క్వారంటైన్ కావడంతో తగిన సిబ్బంది లేక ఉత్పత్తి ప్రక్రియ మందగించింది. మిగిత కార్మికులు విధులకు హాజరు కావాలంటేనే భయపడుతున్నారు. కార్మిక సంఘాల నాయకులు లాక్ డౌన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఐతే యాజమాన్యం లాక్ డౌన్ ప్రకటిస్తుందా లేదా అరకొర సిబ్బందితోనే కొనసాగుతారా వేచిచూడాలి.