Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో
నిన్న ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో కంటైనెమెంట్ జోన్ ఏర్పాటు చేశారు. అంతకముందు చిన్నధర్మారం గ్రామంలో కూడా ఒక పాజిటివ్ కేసు నమోదయింది. దింతో ప్రజాప్రతినిధులు అప్రమత్తమై ముత్యంపల్లి మరియు చిన్నధర్మారం గ్రామంలో కరోనా వచ్చిన ఏరియాలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసి, బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎస్సై రాములు, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, వార్డ్ మెంబర్ సందీప్, చిన్నదర్మరం సర్పంచ్ సునీత, ఉపసర్పంచ్ అశోక్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.