మండలంలోని కాసిపేట 1 గనిలో ఈరోజు రెండు
కరోనా కేసులు నమోదయ్యాయి. ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు సింగరేణి కార్మికులకు పాజిటివ్ రావడంతో గనిలో మొత్తం కేసుల సంఖ్య 12కి చేరగా, మండలంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కరోనా పరీక్షలకు ఉపయోగపడే "బై హజ్ హార్డ్ కవర్" లేనందున నిన్న పరీక్షలు నిర్వహించలేదు. ఈరోజు నిర్వహించాలని భావించినప్పటికీ ఈరోజు కూడా సిబ్బందికి అందకపోవడంతో మళ్ళీ వాయిదా వేశారు. గత శనివారం 6 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో క్షేత్రస్థాయిలో ఎన్ని పాజిటివ్ లు ఉన్నాయో అని ప్రజలలో కొంత ఆందోళన నెలకొంది. దింతో స్థానిక సర్పంచ్ ఆడే బాదు గారు PHC లో కరోనా పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి బాలాజి గారిని అడగగా రేపు తప్పకుండ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
![]() |
వైద్య సిబ్బంది తో మాట్లాడుతున్న ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు |