Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ధర్మారావుపేట మరియు
కొండాపూర్ గ్రామాలలో కరోనా భయం కమ్ముకుంటుంది. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ఈరోజు 16 కేసులు నమోదవడంతో గ్రామాల ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీరంతా నిన్న ధర్మారావుపేట గ్రామంలో జరిగిన అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొనడంతో, అదే కార్యక్రమంలో దాదాపు వంద మంది వరకు పాల్గొనడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకేరోజు ఇద్దరు మృతి:-
స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం ధర్మారావుపేట గ్రామంలో నిన్న తెల్లవారుజామున వృద్దురాలు గుండెపోటుతో చనిపోయింది. ఆమె అంత్యక్రియ కార్యక్రమంలో ధర్మారావుపేట గ్రామంలోని స్థానికులు మరియు కొండాపూర్ గ్రామంలోని బంధువులు దాదాపు వంద మందికి పైగా పాల్గొన్నారు. అదే రోజు సాయంత్రం మృతురాలి భర్తకు పల్స్ రేట్ పడిపోవడంతో కరీంనగర్ లోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి సమయంలో చనిపోయాడు. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాకుండా అక్కడే కళనం చేశారు. వీరికి శ్వాస సమస్యలు ఉండడంతో కరోనా అనుమానంతో అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు ఈరోజు కరోనా పరీక్షలు చేసుకోగా కొండాపూర్ గ్రామంలో తొమ్మిది మందికి మరియు ధర్మారావుపేట గ్రామంలో ఏడు గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ సంఘటనతో రెండు గ్రామాలలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ధర్మారావుపేట గ్రామంలో అధికారులు మరియు గ్రామస్తులు అప్రమత్తమై రేపటి నుండి 8 రోజులపాటు లాక్ డౌన్ పాటించనున్నారు.