Kasipet Mandal App:-
బెల్లంపల్లి మార్కెట్ కమిటీ సభ్యులుగా కాసిపేట
మండలం నుండి ఇద్దరు నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీకి ఒక చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 12మంది కమిటీ సభ్యులను నియమించింది. ఇందులో ధర్మారావుపేట గ్రామ మాజీ ఎంపీటీసీ మంజుల రెడ్డి గారు మరియు కోమటిచేను గ్రామ తెరాస అధ్యక్షులు రామటెంకి వాసుదేవ్ గారు కమిటీ సభ్యులుగా నియమించడంతో కాసిపేట మండల తెరాస నాయకులు, ప్రజలు అభినందనలు తెలిపారు.