Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్
పరిధిలో గల తుంగగూడ గ్రామంలో ప్రభుత్వం నిషేదించిన గడ్డిమందును మహారాష్ట్ర నుండి రహస్యంగా తీసుకువచ్చి విక్రయిస్తున్నాడనే పక్క సమాచారంతో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేసి మేకల మహేష్ వ్యక్తి నుండి 75 లీటర్ల గ్లైఫోసైట్ పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ గారు మాట్లాడుతూ పట్టుబడ్డ గ్లైఫోసైట్ గడ్డి మందు విలువ సుమారు రూ60,000 వరకు ఉంటుందని అన్నారు. ప్రభుత్వం నిషేదించిన గడ్డి మందులు వాడటం వల్ల భూసారం నాశనం కావడమే కాకుండా రైతుల ఆరోగ్యాన్ని హరిస్తుందని పేర్కొన్నారు. ఏవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పట్టుబడ్డ నిందితుడిని మరియు గ్లైఫోసైట్ ను దేవాపూర్ అప్పగించామని అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడిలో టాస్క్ ఫోర్స్ సిఐ T. కిరణ్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ CH. కిరణ్, సిబ్బంది ఓంకార్, వెంకటేష్, రాకేష్ పాల్గొన్నారు.