Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో రేపు నిర్వహించబోయే
రైతు సదస్సు కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేశారు. ముందుగా కార్యక్రమాన్ని కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తామని భావించారు. కానీ ప్రస్తుతం జిల్లాలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వల్ల సభలు, సమావేశాలు హాలులో నిర్వహించవద్దని కాసిపేట పోలీసులు తెలపడంతో కోమటిచేను పంచాయతీ పరిధిలోని కొత్త వారిపేట గ్రామంలో రైతు సదస్సును నిర్వహించనున్నారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహనా కల్పించడకోసం ఏకలవ్య ఫౌండేషన్, మండల వ్యవసాయ శాఖ సహకారంతో సామాజిక ఛైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.