Mancherial District News:-
సింగరేణి ఉద్యోగం కోసం బావమరిదిపై కత్తితో
దాడిచేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు నీలం తిరుపతికి ఒక కుమారుడు, ఒక కూతురు. నీలం తిరుపతి ఇటీవలే మెడికల్ అన్ఫిట్ అయ్యాడు. సింగరేణి ఉద్యోగం తన కొడుకు క్రాంతి కుమార్ కి పెట్టిద్దామని అనుకున్నాడు. సింగరేణి ఉద్యోగంపై కన్నువేసిన అల్లుడు నవీన్ తనకు ఉద్యోగం పెట్టించాలని మామపై ఒత్తిడి చేశాడు. కొడుకు ఉండగా అల్లునికి ఉద్యోగం పెట్టించడం ఇష్టంలేక కుదరదని చెప్పాడు. దింతో నవీన్ క్రాంతికుమార్ పై కక్ష పెంచుకొని తన స్నేహితులతో కలిసి కత్తితో దాడిచేసాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు నవీన్ మరియు అతని స్నేహితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.