Kasipet Mandal App:-
ఈనెల 22 వ తేదీ వరకు ఉచిత రేషన్ బియ్యం
పంపిణి చేస్తామని మంచిర్యాల జిల్లా పౌరసరఫరా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో కొన్ని చౌక ధరల దుకాణాలలో సమస్యలు ఏర్పడడంతో సరుకుల పంపిణి ఆలస్యం అయిందని, అందుకే ప్రభుత్వ ఆదేశాల మేరకు గడువును 22వ తేది వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.