Kasipet Mandal App:-
ఇటీవల కాసిపేట మండలంలోని ధర్మారావుపేట
గ్రామంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయిన విషయం తెలిసిందే. దింతో ప్రజలలో కొంత ఆందోళన నెలకొంది. ప్రజలకు కరోనా పట్ల అవగాహనా కల్పిస్తూ, వైరస్ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈరోజు కీ.శే కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇంటింటికి మాస్కులను పంపిణి చేశారు. మాస్కులను పంపిణి చేసినందుకు రఘుపతి రావు ట్రస్ట్ వారికి గ్రామస్తులు ధన్యవాదములు తెలిపారు.