Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని కోమటి చేను
గ్రామపంచాయతీ పరిధిలోని వరిపేట గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సామాజిక చైతన్య వేదిక వారు రైతు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏకలవ్య ఫౌండేషన్ సీఈవో హరికృష్ణ, ఏకలవ్య ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దిగంబర్, మండల వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీధర్, సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య , సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి తుమ్మల, సామాజిక చైతన్య వేదిక సహాయ కార్యదర్శి ఉమ్మడి కిషన్, ఏకలవ్య ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ పెంటయ్య, సామాజిక చైతన్య వేదిక మండల నాయకులు రాజన్న, సింగిల్ విండో డైరెక్టర్ జంజిరాల కృష్ణమూర్తి, సేంద్రియ రైతు గ్రూపు కన్వీనర్ జంజిరాల రాజు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ రైతులకు సేంద్రియ వ్యవసాయం గురించి, సేంద్రియ ఎరువు తయారీ గురించి వివరించారు. పశువుల పేడతో సేంద్రియ సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని వాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వాడుకోవాలని ప్రభుత్వ నిషేధం విత్తనాలు వాడకూడదని వాడడం వల్ల జరిగే అనర్ధాలు వివరించారు. సేంద్రీయ కూరగాయలు విక్రయించడంతో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం మండలంలో ఉత్సాహంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ధ్రువపత్రాలు ఏకలవ్య ఫౌండేషన్ వారు అందజేసి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారిపేట, కర్షలఘట్టం, బుగ్గ గూడెం గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.