Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తహసీల్దార్ కార్యాలయంలోకి ఎవరు రావొద్దు

Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య
రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు గ్రీన్ జోన్లో ఉన్న మంచిర్యాల జిల్లా ఇప్పుడు 179 కేసులు నమోదయి భయాందోళన స్థితిలో ఉంది. రెవిన్యూ శాఖలో కూడా పలు అధికారులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవలే మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండల తహసీల్దార్ కరోనా వైరస్ లక్షణాలతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా హాజిపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దింతో అప్రమత్తమైన రెవిన్యూ యంత్రంగం కార్యాలయంలోకి ఎవరు రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సమస్యల పరిస్కారం కోసం సంప్రదించాల్సి వస్తే ఈమెయిలు ద్వారా సందేశం పంపాలని సూచిస్తున్నారు. లేదా తమ గ్రామ వీఆర్వో కు కాల్/వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని తెలుపుతున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App