Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని మద్దిమాడ, పల్లంగూడ,
బుగ్గగూడ, చిన్నధర్మారం గ్రామాలలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య గారు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. స్మశానవాటికల నిర్మాణం, డంపింగ్ యార్డులు, పకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఏ అలీం గారు, ఎంఆర్వో భూమేశ్వర్ గారు, గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.