Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ
కార్యాలయంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి గారు పాల్గొని అభివృద్ధి పనులను సమీక్షించారు. పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్పంచులు, కార్యదర్శులపై మండిపడ్డారు. పల్లెప్రగతి, హరితహారం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనీ సూచించారు. పక్క మండలాలలో పనులు చివరి దశలో ఉంటే ఇక్కడ మాత్రం పనులు ముందుకు సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల చివరి వరకు అన్ని పనులను పూర్తి చేయాలనీ ఆదేశించారు. అనంతరం వికలాంగులకు మంజూరైన ట్రై సైకిల్ లను అందజేశారు. కొందరు స్థానికులు కలెక్టర్ గారికి భూ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.