Kasipet Mandal App:-
కాసిపేట మండలం సోమగూడెం భరత్ కాలానికి
చెందిన సింగరేణి కార్మికునికి కరోనా పాజిటివ్ రావడంతో కార్మికుడిని హోమ్ క్వారంటైన్ చేశారు. సింగరేణి ఆరోగ్య శాఖ అధికారి లోకనాథ్ రెడ్డి కార్మికుని నివాసానికి వెళ్లి వ్యాధి నిరోధక మందులు అందజేసి, పలు సూచనలు ఇచ్చారు. ఇప్పటికే కాసిపేట-1 గనిలో మూడు, కాసిపేట-2 గనిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. కాసిపేటలోని రెండు సింగరేణి గనులలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో కార్మికులలో ఆందోళన నెలకొంది.