కాసిపేట మండలంలో ఆదివారం మోస్తరు వర్షం
కురిసింది. గ్రామాలలో చిరు జల్లులు కురిశాయి. నిన్న మండలంలో 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 353.3 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో ఈ సంవత్సరం సాధారణం కన్నా ఎక్కువ వానలు పడతాయని వాతావరణ నిపుణుల అంచనా వేస్తున్నారు.