మంచిర్యాల జిల్లాలోని మందమర్రి రాంనగర్ లో
నివసిస్తున్న నాయికిని సనిత్ కుమార్ - నర్మద దంపతులకు ఇటీవలే పాప జన్మించింది. పాప 7 నెలలకే జన్మించడం వలన 800 గ్రాముల బరువుతో ఉమ్మనీరు సమస్యతో పుట్టింది. వారు పేదవారు కావడంతో చికిత్సకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి కాసిపేట మండలంలోని మనవంతు సహాయం గ్రూప్ సభ్యులు పాప చికిత్స కోసం 20,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మనవంతు సహాయం గ్రూప్ సభ్యులు బోయిని తిరుపతి (ముత్యంపల్లి ఉపసర్పంచ్), ప్రశాంత్ (ముత్యంపల్లి యూత్ ప్రెసిడెంట్), సచిన్, మహేందర్, సాయి, నవీన్, రమేష్ పాల్గొన్నారు. పాపాకు చికిత్స చేయడానికి సహాయం చేయడంతో మన వంతు గ్రూప్ సభ్యులను పలువురు ప్రశంసిస్తున్నారు.