Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆదర్శ గ్రామంలో కేంద్ర బృందం పర్యటన

Kasipet Mandal App:-
ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకానికి
కాసిపేట మండలంలోని కోమటిచెను గ్రామం ఎంపికయ్యింది. ఇందులో భాగంగా బుధవారం  కేంద్ర బృందం గ్రామంలో పర్యటించింది. బృందం సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని 161 కుటుంబాలను సర్వే చేసినట్లు తెలిపారు. గ్రామంలో 20లక్షలతో రోడ్డు నిర్మాణం, అంగన్వాడీ భవనం, డ్రైనేజీలు, పాఠశాలలలో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సురేష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నరేందర్, ఎంపీడీఓ అలీం, ఎంపీఓ మేఘమాల, సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ సూర్యప్రకాష్ పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App