కాసిపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ
పరిధిలోని నాయకపుగూడ పాఠశాల ముందు రోడ్డుపై గుంతలు పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు గూడెంలోని విద్యార్థులు కొంతమంది కలిసి కంకర, ఇసుక వేసి గుంతలను పూడ్చారు. పిల్లలు శ్రమదానం చేసి గుంతను పూడ్చడంతో పలువురు ప్రశంసిస్తున్నారు. గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిదులు ఆదివాసి గూడాల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదివాసీ నాయకులు కోరుతున్నారు.