Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో
బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి రాసిన డిమాండ్ల పత్రాన్ని విద్యుత్ కార్యాలయంలో అందజేశారు. లెటర్ లో ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ విధించిన సందర్భంలో మూడు నెలల కాలంలో అన్ని కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి అనే విషయం మీకు తెలుసు. ప్రజలు పనులు లేక, వ్యాపారాలు పోయి, నిరుపేదలకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. చిరు వ్యాపారస్తులు, రోజు వారి కూలీలు మరియు సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అయితే బ్రతకడమే కష్టంగా ఉన్న ఈ తరుణంలో మూడు నెలల అధిక కరెంటు బిల్లుల భారం ఒకేసారి ప్రజలపై మోపి బిల్లు కట్టండి లేదా కరెంట్ కట్ చేస్తాం అనడంతో ప్రజానీకమంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ మూడు నెలల కాలానికి కరెంటు బిల్లులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి దాన్ని ప్రభుత్వమే భరించాలి అని రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్ట సమయాల్లో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలపై అధిక విద్యుత్ బిల్లులను మోపుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ గోనె శ్రీకాంత్, ST సెల్ కాసిపేట్ మండలం ప్రెసిడెంట్ గుండా రాజకుమార్, కాసిపేట మండల యూత్ కాంగ్రెస్ జాడి శివ, దుగుట భరత్, మహేష్ ఆనంద్, గద్దల ప్రదీప్, బోర్లకుంట రాజు, దీపక్, దుర్గ ప్రసాద్, ఉదయ్, చంద్ర శేఖర్ పాల్గొన్నారు.