Kasipet Mandal App:-
కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఈనెల 27వ తేదీ
నుండి గ్రామాలవారీగా చెక్కులను పంపిణి చేయనున్నట్లు కాసిపేట తహసీల్దార్ భూమేశ్వర్ గారు తెలిపారు. జులై 27వ తేదీన ముత్యంపల్లి, మామిడిగూడ, లంబాడితండా (కే), 28వ తేదీన కోమటిచెను, కొండాపూర్, బుగ్గగూడ, తాటిగూడ, 29వ తేదీన మల్కెపల్లి, మద్దిమాడ, లంబాడితండా (డి) గ్రామాల లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తామని పేర్కొన్నారు.