Kasipet Mandal App:-
తెరాస వర్కింగ్ ప్రసిడెంట్ KTR గారి పుట్టినరోజు
వేడుకలను ఈరోజు కాసిపేట మండలంలో తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. దేవాపూర్, కాసిపేట, ముత్యంపల్లి, ధర్మారావుపేట మరియు తదితర గ్రామాలలో నాయకులు మొక్కలను నాటి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే పుట్టినరోజు సందర్బంగా గట్రావుపల్లి గ్రామంలోని అనాధ పిల్లలకు రూ.13,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాలలో పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.