Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని సోమగూడెం
లంబాడితండాకు చెందిన ఇస్లావత్ సౌజన్య(12) అనే చిన్నారి ఇటీవల పాము కాటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారి మరణం వల్ల కుటుంబం కోలుకోలేని దీన స్థితిలోకి వెళ్ళింది. దింతో కాసిపేట మండలంలోని సోమగూడెం(కె) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా రూ.2000 అందించారు. తాను తడువుతున్న జెడ్పిఎస్ఎస్ లంబాడితండా పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి రూ.5000 సహాయం అందించారు. ప్రధానోపాధ్యాయులు నెన్నెల లచ్చయ్య, ఉపాధ్యాయులు కుడుదుల శ్రీనివాస్, వడ్డి శoకరరావు పాల్గున్నారు.