Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో ప్రవేశించిన మహమ్మారి

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో కరోనా మహమ్మారి ప్రవేశించింది.
ఈరోజు మండలంలో తొలి కరోనా కేసు నమోదయింది. మంచిర్యాల జిల్లా ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో జిల్లాలో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. ఇందులో కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో రెండు పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. నిన్నటి వరకు మండలంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదు. ఈరోజు రెండు కేసులు నమోదవడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటినుండీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. మాస్క్ ధరించి, స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App