Kasipet Mandal App:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో ఇప్పటికే
రెండు కరోనా కేసులు నమోదవడంతో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఈ సమయంలో దేవాపూర్ గ్రామంలోని నాయకపుగూడెంలో ఒక యువకుడు తనకు కరోనా వచ్చిందని 108 కి కాల్ చేసాడు. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయి నాయకపుగూడెం గ్రామానికి చేరుకున్నారు. తీరా గ్రామానికి చేరుకున్నాక తాను మద్యం మత్తులో ఉండి కాల్ చేసాను అని చెప్పడంతో అంబులెన్సు సిబ్బంది సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఎవరు ఇవ్వద్దని, అలా ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.