Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో కరోనా గుబులు మొదలైంది.
ఈ నెల 3వ తేదీన ముత్యంపల్లిలో డంపింగ్ యార్డ్ ఓపెనింగ్, రైతు సమన్వయ వేదిక భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక అధికారికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. ఇప్పటికే అధికార పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను, ప్రజలను అప్రమత్తం చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వారికి సూచించారు. మొదట్లో మున్సిపాలిటీలలో, పట్టణ ప్రాంతాలలో మాత్రమే నమోదయిన కోవిడ్ కేసులు ఇప్పుడు గ్రామాలలో కూడా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. వర్షాకాలం వ్యాధుల సీజన్ కావడంతో సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం ప్రజలను చుట్టుముడతాయి. కరోనా లక్షణాలు కూడా ఇవే కావడంతో ప్రజలలో సాధారణ జ్వరం వచ్చిన భయపడే పరిస్థితి నెలకొంది.