Kasipet Mandal App:-
కరోనా వైరస్ వల్ల విద్య సంవత్సరం ఆలస్యం
అయిన విషయం తెలిసిందే. విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ZPHS మరియు మోడల్ స్కూల్స్ విద్యార్థులకు ముత్యంపల్లి గ్రామ సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, కాసిపేట మండల MEO, మరియు ZPHS హెచ్.ఏం వారి ఆధ్వర్యంలో ఈరోజు పుస్తకాలను అందజేశారు. తదుపరి సర్పంచ్ ఆడే బాదు మాట్లాడుతూ పిల్లలు కరోనా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అని మరియు వారు తమ చదువును నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట MEO దామోదర్ సార్, hm. రాథోడ్ రమేష్ సార్, కృష్ణ గోపాల్ రావు సార్, శాంకరి మేడం, జ్యోతి మేడం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.