Kasipet Mandal App:-
గ్రామ పంచాయతీలకు విద్యుత్ భారాన్ని
కొంతవరకు తగ్గించడానికి కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీలోని సోమగూడెం న్యూ కాలని లో సర్పంచ్ వేముల కృష్ణ గారు వీధి దీపాలకు సెన్సార్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. వీధి లైట్లు ఇష్టం వచ్చినట్లు సమయం లేకుండా వెలుగుతూ ఉంచడం వల్ల విద్యుత్ వినియోగం పెరిగి పంచాయతీకీ కరెంట్ బిల్లు బాగా రావడంతో ఆర్థిక నష్టము వస్తుందని గుర్తించి సెన్సార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన అన్నారు. దీనివల్ల వీధి దీపాలు రాత్రి సమయంలో ఆటోమేటిక్ గా వెలుగుతు ఉదయం సమయంలో ఆఫ్ కావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొత్త రమేష్, బన్న హిందూమతి, కంచర్ల పద్మ, మాజి సర్పంచ్ కామేర శ్రీనివాస్, కో ఆప్సన్ సభ్యులు జీదుల కనకయ్య, గుర్రం వజ్ర, గ్రామ పెద్దలు కుమ్మరి గంగారం, తుడం వెంకటమ్మ లు పాల్గొన్నారు.