Kasipet Mandal App:-
ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూమిలో
హరితహారం పేరుతో మొక్కలు నాటడాన్ని మానుకోవాలని మండలంలోని ఆదివాసీ నాయకులు ఈరోజు తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. భారత రాజ్యాంగం కల్పించిన 1/70 చట్టానికి విరుద్ధంగా అధికారులు నడుచుకుంటున్నారని వాపోయారు. ఆదివాసీలు సాగుచేసుకుంటున్న చింతగూడ శివార్లలోని సర్వే నెంబర్ 61 లో హరితహారం కార్యక్రమం నిలిపివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.