Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ప్రతి గ్రామంలో సర్పంచుల
గౌరవ అధ్యక్షతన సామాజిక చైతన్య వేదిక గ్రామ కమిటీలు ఏర్పటు చేయాలనీ కమిటీ సభ్యులు సమావేశంలో తీర్మానించారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటు, పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలు, తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులకు ధ్యానం, యోగాసనాలపై శిక్షణ ఇవ్వడం మరియు యువకులను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే ఈ వర్షాకాలంలో కరోనా సీజనల్ వ్యాధుల బారినుండి ప్రజలను కాపాడేందుకు గిరిజన గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు ఉపాధ్యక్షుడు మెరుగు శంకర్, సంయుక్త కార్యదర్శి కిషన్, సామాజిక చైతన్య వేదిక యూత్ కమిటీ ఉపాధ్యక్షుడు ఆత్రం జంగు, ప్రధాన కార్యదర్శి బద్రి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి శ్రీ రాముల రమేష్, సభ్యులు మేంద్రపు రాజన్న విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.